Patna vs Haryana: ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ లో హర్యానా, పాట్నా... 6 d ago
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. శుక్రవారం పూణె వేదికగా జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లలో హర్యానా, పాట్నా తమ ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్కు చేరాయి. ఈ టోర్నీ మొత్తం రాణిస్తూ టేబుల్ టాపర్గా ఉన్న హర్యానా, తొలి సెమీస్లో 28-25తో యూపీ యోధాస్ను ఓడించింది. రెండో సెమీస్లో పాట్నా 32-28తో దబాంగ్ ఢిల్లీని చిత్తు చేసింది. హర్యానా, పాట్నా మధ్య ఆదివారం(29) ఫైనల్ పోరు జరుగనుంది.